పవన్ సినిమాపై రూమర్స్ లో నిజం లేదు.!

పవన్ సినిమాపై రూమర్స్ లో నిజం లేదు.!

Published on Aug 19, 2020 4:02 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీని తర్వాత పవన్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో ఒక పీరియాడిక్ డ్రామాను కూడా ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడు పరిస్థితులు ఊహించని విధంగా మారిపోవడంతో ఈ రెండు చిత్రాలకు కూడా బ్రేక్ పడింది. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం చక్కబడటంతో షూటింగులు కూడా మొదలయ్యాయి.

కానీ పవన్ మాత్రం షూటింగ్ కు రాకపోవడంతో ఈ లోపున క్రిష్ మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమాను ప్రారంభించేసారు. ఇక దీనితో అక్కడ నుంచి పవన్ క్రిష్ ల ప్రాజెక్టుపై పలు రూమర్స్ మొదలయాయ్యి. కానీ ఆ రూమర్స్ లో ఎలాంటి నిజమూ లేదన్నట్టు తెలుస్తుంది. క్రిష్ కూడా ఓ విషయాన్ని కన్ఫర్మ్ చేసారు ఈ సినిమా ఆగలేదని వకీల్ సాబ్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం ప్రారంభం కానుంది అని. సో పవన్ సినిమా విషయంలో వస్తున్న రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదు.

తాజా వార్తలు