టాలీవుడ్ లో తన సినిమాలతో మాస్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను తెచ్చుకున్న స్టైలిష్ మాస్ ఫిల్మ్ మేకర్ పూరి జగన్నాథ్. పూరి నుంచి ఒక సరైన సినిమా పడి చాలా కాలం అవుతుంది అన్న సందర్భంలో ఒకేసారి పూరికి హీరో రామ్ కు అలాగే సంగీత దర్శకుడు మణిశర్మలకు సాలిడ్ కం బ్యాక్ చిత్రంగా వచ్చింది “ఇస్మార్ట్ శంకర్” చిత్రం.
మంచి హైప్ తో గత ఏడాది విడుదల కాబడిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకొని డబుల్ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనితో రామ్ మరియు పూరీల కాంబో అంటే మంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే అక్కడ నుంచే వీరి కాంబోలో మరో చిత్రం ఉంటుందని వారు చెప్పేసారు.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై మరింత సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం పూరి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఒక యాక్షన్ మూవీ తీస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే రామ్ తో సినిమాను మొదలు పెట్టనున్నారట. మరి ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెలా లేదా కొత్త ప్రాజెక్టా అనేది తెలియాలి.