అప్పుడు “బాహుబలి”కి ఇప్పుడు “ఆదిపురుష్”కి.!

అప్పుడు “బాహుబలి”కి ఇప్పుడు “ఆదిపురుష్”కి.!

Published on Aug 18, 2020 6:44 PM IST


ఇప్పుడు ప్రభాస్ పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. భారీ ప్రాజెక్ట్ నుంచి అతనికి పేరు రావడం నుంచి అతని వల్ల ఓ ప్రాజెక్ట్ కు ఇప్పుడు భారీతనం వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ స్థాయికి ప్రభాస్ ఇప్పుడు చేరుకొన్నాడు. అలా ఇప్పుడు లేటెస్ట్ గా మొదలు పెట్టిన భారీ ప్రాజెక్ట్ “ఆదిపురుష్” దర్శకుడు ఓం రౌత్ ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించినట్టు తెలుస్తుంది.

తాను ఈ ప్రాజెక్ట్ ను అనుకున్నప్పుడు తన మైండ్ లో మొట్ట మొదటిగా మెదిలినది ప్రభాస్ తాలూకా విజువల్ మాత్రమే అని ఈ కథకు అతను తప్ప మరో హీరో సూటవ్వరని తెలిపారట. ఇలా ఈ భారీ ప్రాజెక్ట్ కు ప్రభాస్ పేరు ఎలా వచ్చిందో అప్పుడు తాను నటించిన బాహుబలి చిత్రం విషయంలో కూడా దర్శకుడు రాజమౌళి మరియు రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అలా అప్పుడు ప్రభాస్ లేనిది బాహుబలి లేదో ఇప్పుడు ఈ ఆదిపురుష్ కూడా మరో హీరోతో లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు