మెగా ఫ్యాన్స్ ట్రీట్ కు సర్వం సిద్ధం.!

మెగా ఫ్యాన్స్ ట్రీట్ కు సర్వం సిద్ధం.!

Published on Aug 18, 2020 4:19 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడో మొదలు పెట్టిన ఈ చిత్రం నుంచి అధికారికంగా ఎలాంటి అప్డేట్ కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. దీనితో అక్కడ నుంచి వారికి ఎన్నో రోజులు ఎదురు చూపులు అనంతరం ఎట్టకేలకు చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్టుగా కన్ఫామ్ చేసారు.

వచ్చే ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో అదే స్పెషల్ డే రోజున సాయంత్రం 4 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ లను విడుదల చెయ్యనున్నట్టుగా ఒక ప్రీ పోస్టర్ ద్వారా ఖరారు చేసారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్ని ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మించనుండగా మెగాస్టార్ మ్యాజికల్ కాంబో మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరి మణిశర్మ పవర్ ఫుల్ బిజీఎం మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ లు ఎలా ఉండనున్నాయో తెలియాలి అంటే అప్పటివరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు