ఇప్పుడు మన సౌత్ ఇండియన్ సినిమాలో లేడీ ఓరియెంటెడ్ సినిమా టాపిక్ వస్తే అందులో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పేరు కూడా ముందు వరుసలో వినిపిస్తుంది. అయితే ఆమె మెయిన్ లీడ్ లో నటించిన తాజా సినిమా “పెంగ్విన్” ఎన్ని అంచనాల నడుమ నేరుగా ఓటిటిలో విడుదల అయ్యిందో అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని భారీ ధరకే దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చేసారు.
కానీ తర్వాత ఈ చిత్రానికి బ్యాడ్ టాక్ రావడంతో ఆమె నటించిన తర్వాత చిత్రాలకు కాస్త తక్కువ మొత్తంలో ఆఫర్ చేసారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఆమె నటించిన మరో లేటెస్ట్ సినిమా “గుడ్ లక్ సఖి” చిత్రానికి మంచి స్పందన రావడంతో ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రానికి మంచి ధర ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి వారు 13 కోట్లకు పైగానే ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం కూడా నేరుగా ఓటిటి లోనే విడుదలయ్యే సూచనలు ఉన్నట్టు కూడా ఇప్పుడు సమాచారం.