ఎట్టకేలకు డార్లింగ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న తన 22 వ చిత్రం అనౌన్స్మెంట్ వచ్చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ తో ఓ సినిమా ఉందని వస్తున్న వార్తలను నిజం చేస్తూ “ఆదిపురుష్” అనే మరో భారీ పీరియాడిక్ వండర్ కు ప్రభాస్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే “రాధే శ్యామ్” తో పాటు నాగశ్విన్ తో మరో భారీ ప్రాజెక్ట్ ను ఓకె చేసిన ప్రభాస్ మళ్లీ ఈలోపునే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి హాట్ టాపిక్ అయ్యారు.
జస్ట్ ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే మంచి హైప్ ను తెప్పించిన ఈ చిత్రంకు సంబంధించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఈ చిత్రాన్ని మొత్తం 5 భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించగా హిందీ మరియు తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కించి మిగతా భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారట.
అలాగే ఈ భారీ ప్రాజెక్ట్ ను నార్మల్ గానే కాకుండా ప్రభాస్ ఇది వరకు టచ్ చెయ్యని 3డి టెక్నాలజీలో తెరకెక్కించనున్నారు. అలాగే ఈ చిత్రం శ్రీమహావిష్ణు మొట్టమొదటి అవతారం “ఆదిపురుషుడు” ఆధారంగా చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే మన దేశపు ఇతిహాసంను అనుసరించి తెరకెక్కనుంది. మరి ఈ భారీ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.