బాలయ్యకు కథ చెప్పబోతున్న స్టార్ రైటర్ !

బాలయ్యకు కథ చెప్పబోతున్న స్టార్ రైటర్ !

Published on Aug 18, 2020 3:00 AM IST

బాలయ్య బాబు కోసం ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఓ కథను సిద్ధం చేశారు. ఇప్పటికే సాయి మాధవ్ స్క్రిప్ట్ ను పూర్తి చేసినట్లు… త్వరలోనే బాలయ్యకు కథను చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు కథ నచ్చితే సీనియర్ డైరెక్టర్ – బి.గోపాల్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాడట. బాలయ్య బాబు – బి.గోపాల్ లది సూపర్ హిట్ కాంబినేషన్. బాలయ్య కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాలలో టాప్ చిత్రాలు బి గోపాల్ డైరెక్ట్ చేసినవే.

మరి చూడాలి ఈ సూపర్ హిట్ కాంబో మళ్లీ సక్సెస్ అవుతుందో లేదో. అయితే ఫుల్ యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ ను సాయి మాధవ్ బాలయ్య కోసం రాసాడట. మరి స్క్రిప్ట్ బాలయ్యకు నచ్చితే వచ్చే ఏడాది నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. బాలయ్యకు పెద్ద హిట్ ఇవ్వాలనే కసితో బోయపాటి ఈ సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు