విజయ్ దేవరకొండ నిర్మాణంలో వెబ్ సిరీస్ !

విజయ్ దేవరకొండ నిర్మాణంలో వెబ్ సిరీస్ !

Published on Aug 17, 2020 11:55 PM IST

‘అర్జున్ రెడ్డి’ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు. ఇక ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి వంగా కూడా తొలి సినిమాతోనే క్రేజీ డైరెక్ట‌ర్‌ గా మారడం, పైగా బాలీవుడ్ లో ఇదే సినిమాని క‌బీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్క‌డ సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ లో మరో చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు.

కాగా సందీప్ వంగ – విజయ్ దేవరకొండ కలిసి ఒక వెబ్ సిరీస్ ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ చేస్తాడట మొత్తానికి ‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్ లో మ‌రో ఓ వెబ్ సిరీస్ రాబోతుంది. ఇక ప్రస్తుతం డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ సినిమా చేస్తోన్నాడు. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తుండటం, పైగా మొదటిసారి పాన్ ఇండియా మూవీ చేస్తోన్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు