శంకర్ కి సూపర్ స్టార్ బెస్ట్ విషెస్ !

శంకర్ కి సూపర్ స్టార్ బెస్ట్ విషెస్ !

Published on Aug 17, 2020 1:44 PM IST

టెక్ మాంత్రికుడు డైరెక్టర్ శంకర్ పుట్టిన రోజు నేడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి శంకర్ సినిమాలు అంటే ఇష్టం ఉన్న సంగతి తెలిసిందే. కాగా మహేష్ బాబు, శంకర్ పుట్టిన రోజుకు సంబంధించి పోస్టు చేస్తూ.. “మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు శంకర్ సర్. మీ సృజనాత్మకతో మీ సినిమాలతో మీరు మాకు ఇలాగే స్ఫూర్తినిస్తూ ఉండండి. ఎల్లప్పుడూ మీరు ఆనందంగా ప్రశాంతతో ఇలాగే నవ్వుతూ సురక్షితంగా ఉండండి: అని మహేష్ పోస్ట్ చేశారు.

ఇక ప్రస్తుతం శంకర్‌ – కమల్‌ హాసన్‌ ల కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. ఇక టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దనున్నారు. మరి ఈ సినిమానైనా అటు కమల్ కి ఇటు శంకర్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు