“సర్కారు వారి పాట”కు ఫస్ట్ ఎవర్ రికార్డు.!

“సర్కారు వారి పాట”కు ఫస్ట్ ఎవర్ రికార్డు.!

Published on Aug 16, 2020 8:29 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా ఉన్నారు. ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చెయ్యకుండా కేవలం ప్రీ లుక్ పోస్టర్ తోనే భారీ రికార్డులను నెలకొల్పుతున్నారు.

గత మే 31 న విడుదల చేసిన జస్ట్ ప్రీ లుక్ పోస్టర్ తోనే ట్విట్టర్ లో ఫాస్టెస్ట్ లక్ష లైకులు కొల్లగొట్టిన పోస్టర్ గా ఫస్ట్ ఎవర్ రికార్డును నమోదు చెయ్యగా ఇప్పుడు అదే పోస్టర్ తో ఫస్ట్ ఎవర్ 50 వేల రీట్వీట్స్ ను అందుకున్న పోస్టర్ గా మరో రికార్డును అందుకుంది. ఈ సరికొత్త రికార్డును మహేష్ ఫ్యాన్స్ మహేష్ కు అందించారు. ఇప్పుడే ఇలా ఉంటే మరి ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తే ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు