పవన్ లైనప్ లో ఈ మాస్ దర్శకుడు కూడానా.?

పవన్ లైనప్ లో ఈ మాస్ దర్శకుడు కూడానా.?

Published on Aug 17, 2020 12:00 AM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. అలాగే పవన్ కూడా ఎలాగో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ఏమో కానీ అతని సినిమాలపై మాత్రం నిరంతరంగా అలా ఏదొక సరికొత్త బజ్ వినిపిస్తుంది. ప్రస్తుతం పవన్ లైనప్ లో వరుసగా “వకీల్ సాబ్” తో శ్రీరామ్ వేణు, తర్వాత ఓ పీరియాడిక్ డ్రామాతో క్రిష్, అలాగే తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఓ సినిమాను పవన్ అంగీకరించారు.

ఇవి అధికారికంగా ఖరారు అయ్యిన చిత్రాలు. ఇక వీటి తర్వాత పవన్ ఎవరితో చేస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజుల నుంచి అయితే పవన్ చెయ్యబోయే 29 వ సినిమాకు చాలా మంది దర్శకుల పేర్లే వినిపించాయి. వారిలో కీలకంగా సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్, సుకుమార్ పేర్లు వినిపించగా ఇప్పుడు మరో మాస్ దర్శకుని పేరు కూడా వినిపిస్తుంది.

అతనే మాస్ మహారాజ్ రవితేజ కు మాస్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ దర్శకుడు ఇప్పుడు రవితేజ తోనే “క్రాక్” అనే పవర్ ఫుల్ కాప్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. మరి నిజంగానే పవన్ తో సినిమా ఉందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. మొత్తానికి మాత్రం పవన్ 29 వ సినిమా లిస్ట్ లో మరో దర్శకుని పేరు పడ్డట్టయ్యింది.

తాజా వార్తలు