మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లిన సంజయ్ దత్ !

మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లిన సంజయ్ దత్ !

Published on Aug 16, 2020 7:18 PM IST

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్ గత వారం స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సంజయ్ సన్నిహితులు నివేదించడంతో ఈ బాలీవుడ్ స్టార్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా తాజాగా సంజయ్ మెరుగైన వైద్య చికిత్స కోసం త్వరలో అమెరికాకు వెళ్లనున్నాడు.

ఇదిలావుండగా, సంజయ్ శనివారం మరియు ఆదివారం ముంబైలోని లీలావతి ఆసుపత్రికి మళ్లీ వెళ్లారు. అయితే, ఆందోళన చెందడానికి ఏమీ లేదని.. సాధారణ చెకప్ కోసం మాత్రమే సంజయ్ ఆసుపత్రిని సందర్శించాడని.. సంజయ్ సోదరి ప్రియా దత్ వెల్లడించారు.

కాగా సంజయ్ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. వైద్యులు సంజయ్ ఊపిరితిత్తుల నుండి నీటిని తీశారు. మార్చిలో లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి సంజయ్ భార్య మన్యత మరియు ఆయన పిల్లలు దుబాయ్ లో ఉంటున్నందున.. ముంబై లోని తన నివాసంలో సంజయ్ ఒంటరిగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం ఆయన దగ్గరికే వచ్చింది.

ఇక ప్రతిష్టాత్మక కెజిఎఫ్ 2 మూవీలో సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నారు. అధీరా అనే ప్రధాన విలన్ గా సంజయ్ దత్ పెద్ద జెడ, ముఖంపై టాటూలు కలిగి ఉన్న భయంకరమైన విలన్ గా కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు