అది ఫేక్ న్యూస్ అని తేల్చేసిన చిరంజీవి.

అది ఫేక్ న్యూస్ అని తేల్చేసిన చిరంజీవి.

Published on Apr 11, 2020 4:54 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన తల్లిగారైన అంజనా దేవి గురించి ప్రచురించిన ఓ వార్తపై ఆయన స్పందించారు. ఆ కథనంలో పొందుపరచిన ఫోటోలో ఉన్న మహిళ తన తల్లికాదని చెప్పారు. కరోనాపై పోరులో చిరంజీవి తల్లి అంజనాదేవి భాగమయ్యారని, ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టి అవసరమైన వారికి అందజేస్తున్నారని ఓ పేపర్‌లోనే కాకుండా పలు ఛానళ్లలో ప్రసారం చేయడం జరిగింది.

అయితే దీనిపై స్పందించిన చిరంజీవి..”మా అమ్మగారు మాస్క్‌లు తయారుచేస్తున్నారనే వార్తలు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం చూశాను. ఆ మీడియా కథనంలో ఉన్నది మా అమ్మగారు కాదని వినయంగా తెలియజేస్తున్నాను. కానీ ఎవరైతే ఈ కథనంలో ఉన్నారో ఆ తల్లికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే..” అని చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు