ఎన్టీఆర్ పంపిన గిఫ్ట్ చరణ్ కి అందేది ఎప్పుడంటే..!

ఎన్టీఆర్ పంపిన గిఫ్ట్ చరణ్ కి అందేది ఎప్పుడంటే..!

Published on Mar 27, 2020 11:54 AM IST

రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని భీమ్ ఫర్ రామరాజు పేరుతో నేడు ఓ స్పెషల్ వీడియో విడుదల కానుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ నిన్న ఈ విషయాన్ని ధ్రువీకరించడం జరిగింది. ఐతే నేడు ఉదయం 10:00 గంటలకు ఈ వీడియో విడుదల కావాల్సివుండగా కొన్ని సాంకేతిక కారణాలతో లేటైనట్లు తెలుస్తుంది. కాగా ఈ వీడియోని నేటి సాయంత్రం 4:00 గంటలకు విడుదల చేయనునట్లు తెలుస్తుంది. దీనిపై ఎన్టీఆర్ అండ్ చరణ్ ట్విట్టర్ వేదికగా హింట్ ఇచ్చారు.

చరణ్ బర్త్ డే కానుకగా రానున్న ఈ వీడియోలో జక్కన్న ఏమి సర్ప్రైజ్ ఇవ్వనున్నాడో అని అటు చరణ్ ఫ్యాన్స్ తో పాటు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన టైటిల్ లోగో మోషన్ పోస్టర్ కి విశేష ఆదరణ దక్కింది. డి వి వి దానయ్య 400కోట్లకు పైగా వ్యయం తో నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు