సూపర్ హిట్ మూవీ ‘రచ్చ’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మాస్ చిత్రాల దర్శకుడు వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాయక్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ తో కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ జోడీ కట్టారు. ఈ చిత్రానికి సంబందించిన అన్ని పాటల రికార్డింగ్ పూర్తయ్యింది మరియు అందులో నాలుగు పాటల చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. ఈ విషయాన్ని ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎస్. ఎస్ తమన్ తెలిపారు. ‘ ‘నాయక్’ సినిమాలోని చివరి పాటని కూడా పూర్తి చేసాను మరియు సాంగ్ చాలా బాగా వచ్చింది. ఇప్పటివరకూ కంపోజ్ చేసిన నాలుగు పాటల చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. ఆ పాటల విజువల్స్ చాలా బాగున్నాయి మరియు ఆ పాటల్లో రామ్ చరణ్ స్టెప్పులు అదిరిపోయాయి. డిసెంబర్లో ఆడియో విడుదల చేయబోయే ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని’ తమన్ తెలిపారు. ఈ మూవీ యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2013 జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రామ్ చరణ్ డాన్సులు అదరగొట్టాడంట.!
రామ్ చరణ్ డాన్సులు అదరగొట్టాడంట.!
Published on Oct 20, 2012 6:37 PM IST
సంబంధిత సమాచారం
- దుమ్ము లేపుతున్న ‘లిటిల్ హార్ట్స్’.. జాక్ పాటే.!
- బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్: సామాన్యులు, తారలు వీరే
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో హీరోయిన్స్ క్యూట్ మూమెంట్స్!
- ‘మిరాయ్’లో AI విజువల్స్.. అందరి నోర్లు మూయించిన తేజ సజ్జ
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ కి టైం ఫిక్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!