తండ్రి కవితలకి స్టెప్పులేసిన అమితాబ్.!

తండ్రి కవితలకి స్టెప్పులేసిన అమితాబ్.!

Published on Oct 11, 2012 4:33 PM IST


ఇండియాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ఇండియాలో అందరికీ సుపరిచితుడైన అమితాబ్ గారి 70వ పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా రిలయన్స్ వారు ముంబైలో రాత్రి అమితాబ్ పుట్టిన రోజు వేడుకని గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకి ఇండియా నలుమూలల నుండి ప్రముఖులు హాజరయ్యారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి – సురేఖ, నాగార్జున – అమల, రామ్ చరణ్ – ఉపాసన మరియు రానా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తి కరమైన విషయం చోటు చేసుకుంది. అదేమిటంటే అమితాబ్ బచ్చన్ గారు ఆయన తండ్రి హరివాన్ష్ రాయి బచ్చన్ గారి కవితలకి స్టెప్పులేసి అందరినీ అలరించారు. ఇది ఆ పార్టీలో బాగా హైలైట్ అయ్యిందని సమాచారం. ఇండియా లోని ప్రముఖులందరూ హాజరైన ఈ కార్యక్రమంలో తన తండ్రి గారి కవితలకి అమితాబ్ స్టెప్పులు వేయడం చూస్తుంటే ఆయనకి వారి తండ్రి గారి కవితలంటే ఎంత ఇష్టమో తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు