అవుంటే చాలు దెయ్యం అవసరం లేదు : వర్మ

అవుంటే చాలు దెయ్యం అవసరం లేదు : వర్మ

Published on Oct 11, 2012 12:56 PM IST


రామ్ గోపాల్ వర్మ లైట్స్ మరియు సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ ఉపయోగించడంలో దిట్ట అని చెప్పుకోవడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. వర్మ హర్రర్ సినిమాలను తీసేటప్పుడు ఈ టెక్నిక్స్ ని బాగా ఉపయోగిస్తారు. వర్మ తీసిన ‘దెయ్యం’ మరియు ‘భూతం’ సినిమాలలో దెయ్యాలు చూపించి ఎక్కువ భయపెట్టకపోయినా సౌండ్స్ తో బాగానే భయపెట్టారు. అలాంటి వర్మ ఈ సారి 3డి ఎఫ్ఫెక్ట్స్ తో తీసిన ‘బూచి’ చిత్రంతో ప్రేక్షకులను భయపెట్టనున్నారు.

వర్మ హర్రర్ సినిమాలు థ్రిల్లింగ్ గా ఉంటాయని అంటున్నారు. ‘ హార్రర్ సినిమాలు ఎంతో థ్రిల్లింగ్ భావనకు గురి చేస్తాయి. హార్రర్ సినిమాలు తీయడానికి భయంకరమైన దెయ్యాన్ని చూపించనవసరం లేదు, భయపెట్టే సౌండ్ ఎఫ్ఫెక్ట్స్, మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు మచి ప్లేస్ లో కెమెరా పెట్టి లైటింగ్ ఎఫ్ఫెక్ట్స్ కరెక్ట్ గా ఉంటే చాలు. అలానే నేను హర్రర్ సినిమాలు చేస్తున్నానని’ వర్మ అన్నారు. ‘బూచి’ సినిమా రేపు ఆంధ్రప్రదేశ్లో విడుదలవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు