ఒకప్పుడు నక్సలైట్ అవుదామనుకున్నాను : మురుగదాస్

ఒకప్పుడు నక్సలైట్ అవుదామనుకున్నాను : మురుగదాస్

Published on Oct 11, 2012 8:31 AM IST


సాధారణంగా డాక్టర్ అవ్వలనుకుని యాక్టర్ అయ్యామని చాలామంది సినిమా వాళ్ళు చెప్పడం విన్నాం, కానీ మురుగదాస్ మాత్రం నక్సలైట్ అవ్వాలనుకుని డైరెక్టర్ అయ్యాడు. అవును ఇది నిజమే. కెరీర్ మొదలైన తొలినాళ్ళలో మురుగదాస్ నక్సలైట్ అవ్వాలనుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పాడు. నేను కాలేజీ రోజుల్లో ఉండగా నాకు కొన్ని సాంఘిక శక్తుల నుండి సమస్యలు ఏర్పడ్డాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాలేదు. ఆ వయసు ప్రభావం వలనో ఏమో కానీ నక్సలైట్ అవుదామనుకున్నాను. ఒక చిన్న పాపా ఫోటో వల్ల ఒక యుద్ధం జరగకుండా ఆగిపోయిందని విని విన్నాను. ఒక్క ఫోటో వల్ల యుద్ధం ఆగిపోయిందని విని నేను కూడా నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఆ రోజు మురుగదాస్ నక్సలైట్ గా మారాలి అన్న నిర్ణయం విరమించుకోవడం ఎంత మంచిది అయిందో. మురుగదాస్ గజినీ, స్టాలిన్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. త్వరలో విజయ్ తో తుపాకి అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో డబ్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు