రేపే ‘డమరుకం’ సెన్సార్.!

రేపే ‘డమరుకం’ సెన్సార్.!

Published on Oct 10, 2012 3:01 PM IST


‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రం రేపు సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోవడానికి సెన్సార్ బోర్డుకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 19న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు తెలియజేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర విడుదల తేదీపై కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ సముఖత వ్యక్తం చేయకపోవడంతో, ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారే స్వయంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

మేము తాజా వార్త ఏమిటంటే అనుకున్న సమయానికి సి.జి షాట్స్ పూర్తి కావని, కొన్ని షాట్స్ ని తొలగించారని సమాచారం. హై లెవల్ టెక్నికల్ ఎఫ్ఫెక్ట్స్ తో నాగార్జున కెరీర్లోనే అత్యంత భారీగా తెరకెక్కిన చిత్రం ‘డమరుకం’. అనుష్క కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు రేపు మధ్యాహ్నం ప్రారంభమవుతాయి. రేపు సాయంత్రం కల్లా సెన్సార్ రిపోర్ట్ వివరాలు తెలుస్తాయి. మాకు సమాచారం తెలిసిన వెంటనే మీకు అందజేస్తాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు