మిస్టర్ నోకియా విడుదల తేదీ ఖరారు.

మిస్టర్ నోకియా విడుదల తేదీ ఖరారు.

Published on Jan 11, 2012 4:00 PM IST


మంచు మనోజ్ కుమార్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మిస్టర్ నోకియా విడుదలకు ఫిబ్రవరి 3న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర ఆడియో సంక్రాంతికి విడుదల కాబోతుంది. మనోజ్ కి జంటగా సనా ఖాన్ మరియు కృతి ఖర్బంధ నటించారు. ఈ చిత్రానికి అనిల్ దర్శకత్వం వహించగా డి.ఎస్. రావు నిర్మించారు.

కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు మరియు కార్ చేసింగ్ దృశ్యాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా రెండు పాటలకి మనోజ్ సాహిత్యం అందించారు. రవితేజ నటించిన ‘నిప్పు’ మరియు సిద్ధార్థల ‘లవ్ ఫేల్యూర్’ చిత్రాలకు పోటీగా విడుదలవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు