సెప్టెంబర్లో వెంకీ డ్రీం ప్రాజెక్ట్

సెప్టెంబర్లో వెంకీ డ్రీం ప్రాజెక్ట్

Published on Jan 11, 2012 12:01 PM IST


విక్టరీ వెంకటేష్ ని ఎన్నో సంవత్సరాలుగా ఊరిస్తున్న ప్రాజెక్ట్ త్వరలో కార్యరూపం దాల్చబోతుంది. ‘స్వామి వివేకానంద’ మీద సినిమా తీయాలని ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ నుండి ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి మణిశంకర్ దర్శకత్వం వహిస్తారు.

వెంకటేష్ ఈ చిత్రం గురించి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన చెప్పే డైలాగులు ప్రజలపై ఎంతో ప్రభావితం చూపిస్తాయని వెంకటేష్ అన్నారు. వివేకానంద సినిమా కమర్షియల్ గా ఎంత వరకు వర్కవుట్ అవుతుంది అని అడగగా వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది అప్పుడు మీకే తెలుస్తుంది అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు