‘అర్జున’లో రాజశేఖర్ ద్విపాత్రాభినయం

‘అర్జున’లో రాజశేఖర్ ద్విపాత్రాభినయం

Published on Jan 11, 2012 10:54 AM IST


యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ తన తరువాత చిత్రం ‘అర్జున’ లో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ ప్రజల కోసం పోరాడే వ్యక్తిగా కనిపించబోతున్నారు. కన్మణి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కె.చంద్రశేఖర్ మరియు ఎ.ఉదయభాస్కర్ నిర్మించారు.

ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. మయమ్ జకారియా మరియు రేఖ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజశేఖర్ పాత్ర పవర్ఫుల్ గా ఆసక్తికరమైన డైలాగులతో సాగుతుందని చిత్ర దర్శకుడు కన్మణి అన్నారు. కోట శ్రీనివాస రావు, ఆహుతి ప్రసాద్ మరియు చలపతి రావు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు