సమీక్ష : సెకండ్ హ్యాండ్- సినిమా బాగుంది, కానీ..

విడుదల తేదీ : 13 డిసెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2. 75/5
దర్శకుడు : కిషోర్ తిరుమల
నిర్మాత : బీవీఎస్ రవి, పూర్ణ నాయుడు
సంగీతం : రవిచంద్ర
నటీనటులు : ధన్య బాలకృష్ణ, సుదీర్ వర్మ, విష్ణు, అనుజ్ రామ్..

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘సెకండ్ హ్యాండ్’ సినిమా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముందే రెస్పాన్స్ ను నమోదు చేసుకుంది. ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ, కిరీటి దామరాజు, సుదీర్, విష్ణులు ప్రధాన పాత్రలలో నటించారు. ‘సెకండ్ హ్యాండ్’ సినిమాకి ప్రముఖ రచయిత బీవీఎస్ రవి కో – ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

‘సెకండ్ హ్యాండ్’ సినిమా మూడు డిఫరెంట్ లవ్ స్టోరీలకు సంబందించింది. వారు సంతోష్ (సుదీర్ వర్మ), సుబ్బారావు (కిరీటి దామరాజు), సహస్ర (ధన్య బాలకృష్ణ). ఇవన్ని ఫెయిల్ అయిన ప్రేమ కథలు. అంతేకాకుండా ఇవి డిఫరెంట్ లవ్ స్టోరీస్.

సంతోష్ ఒక జూనియర్ ఫోటోగ్రాఫర్. తను దీపు అనే అమ్మాయిని చాలా డీప్ గా ప్రేమిస్తాడు. ఈ ప్రేమ కథ చాలా సాఫీగా, రొమాంటిక్ గా సాగిపోతు వుంటుంది. అలాంటి సమయంలో కొన్ని ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల, వారికి ఉన్న వ్యక్తిగత లక్ష్యాల వల్ల వారి మద్య దూరం పెరుగుతుంది. సంతోష్ ఎంతో భాదాపడుతూనే దీపును వదులుకుంటాడు.

సుబ్బారావు చాలా మంచి వ్యక్తి, జెంటిల్ మ్యాన్. అతను విశాలమైన మనసు కలిగిన వ్యక్తిగా భావిస్తూ ఉంటాడు. సుబ్బారావు స్వేఛ్చ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆమె తనకు గతంలో వేరొకతనితో గల సంబంధాన్ని గురించి చెబుతుంది. ఆమెను సుబ్బారావు అర్థం చేసుకుంటాడని భావిస్తుంది. కానీ ఆమె ప్రయత్నం వృదా అవుతుంది.

సహస్ర ఒక యంగ్ అమ్మాయి. తను ఫ్రెండ్ కి లవర్ కి మధ్య ఉన్నా తేడా తెలియని అమ్మాయి. ఈ మూడు ప్రేమ కథల గురించి, చివరికి వారంతా ఏమయ్యరనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ ప్రేమికులంత చివరి వరకు ఎలా కలుసుకుంటారు అనేది కథ. వీరందరూ వీరికి పోసాని కృష్ణ మురళి వల్ల ఒకరి గురించి ఒకరు ఎలా తెలుసుకున్నారు అనేది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ చాలా బాగా చేసింది. ఈ సినిమాలో ఆమె మూడు డిఫరెంట్ పాత్రలలో నటించింది. ఆమె ప్రతి దానిలో కొత్తగా కనిపించడానికి చాలా ప్రయత్నం చేసింది. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది. అలా అని ఈ సినిమాలో ఎలాంటి అల్ట్రా గ్లామరస్ పాత్రలో కనిపించలేదు.

కిరీటి దామరాజు సుబ్బారావుగా ఎంటర్టైనింగ్ పాత్రలో నటించాడు. అతను టైమింగ్ కు తగినట్టుగా కామెడీ చేయడం జరిగింది. సుదీర్ వర్మ కూడా బాగా చేశాడు. విష్ణు అందరిని మెప్పించే విదంగా చైతన్యగా మంచి పెర్ఫామెన్స్ చేశాడు. దీనిలో అతని టాలెంట్ ను మరోసారి మనం చూడవచ్చు.

డైరెక్టర్ మొదటి హాఫ్ ని చాలా బాగా తీశాడు. మొదటి బాగంలో సినిమా మంచి వేగంతో డీసెంట్ గా సాగుతుంది. ఈ బాగంలో ఎంటర్టైనింగ్ పార్ట్ బాగుంది. ధన్య చేసిన మూడు డిఫరెంట్ పాత్రలు చాలా వినూత్నంగా వున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి లాస్ ఈ సినిమా సెకండ్ హాఫ్, దీనిలో అవసరంలేని మేలో డ్రామా ఎక్కువగా ఉంది. సినిమా వేగం తగ్గుతూ రావడం వల్ల కథ అస్సలు ముందుకు కదలదు. ఈ సినిమా మొదటి బాగంలో వున్న ఎంటర్టైన్మెంట్ రెండవ బాగంలో కనిపించదు. ఈ సినిమాలో డైరెక్టర్ కిషోర్ తిరుమల ఒక తమిళియన్ గా ఎంట్రీ ఇస్తాడు. ఈ సినిమాకి ఆ పాత్ర అవసరం లేదు.

ఈ సినిమాలో సహస్ర కథ రివీల్ కాగానే ఆ తర్వాత జరిగే వాటిని మనం ముందుగానే ఊహించవచ్చు. ఈ సినిమాని చూస్తుంటే బోర్ గా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాని చూస్తుంటే దీనిని తక్కువ బడ్జెట్ తో నిర్మించారనే విషయం అర్థమవుతుంది.
ఈ సినిమా సెకండ్ హాఫ్ లో విసువల్స్ చాలా పూర్ గా ఉన్నాయి. (ఈ సినిమా ప్రొడక్షన్ టీం మాత్రం టెక్నికల్ గా వచ్చిన ఓ పెద్ద ప్రాబ్లం వల్ల అలా జరిగిందని అంటున్నారు.

సాంకేతిక విభాగం:

బడ్జెట్ కు తగినట్టుగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కోసం ఉపయోగించిన కెమెరాలు, సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరవాలేదు. ఈ సినిమాకి ఇది చాలా హెల్ప్ అయ్యింది. బడ్జెట్ కు తగినట్టుగా ఎడిటింగ్ నీట్ గా ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. కిషోర్ తిరుమల సమర్ధత కలిగిన డైరెక్టర్. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఎంటర్టైనింగ్ ఉండి ఉంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది.

తీర్పు :

నటీనటుల పెర్ఫార్మన్స్, స్క్రీన్ ప్లే మరియు కామెడీ తో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంటుంది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే డైరెక్టర్ సెకండాఫ్ లో అదే ఫ్లోని డీల్ చేయలేకపోయాడు. ఇప్పటికే మీరు మీ రొమాంటిక్ రిలేషన్ లో ఫెయిల్ అయిన వారికి సెకండ్ హ్యాండ్ సినిమా బాగా అనిపిస్తుంది. మిగతా వారికి సినిమా యావరేజ్ గా అనిపిస్తుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ – 2. 75/5

రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు
అనువాదం : నగేష్ మేకల

 

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version