
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే అఖండ 2 తాండవం. భారీ బడ్జెట్ తో దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఇక నిన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ ట్రైలర్ బయటకు వచ్చేసింది.
ఇక ఈ ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి అని చెప్పాలి. మొదటి పార్ట్ కి కొనసాగింపుగా సాలిడ్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేసిన ఈ ట్రైలర్ అన్ని వర్గాలు ప్రేక్షకుల అటెన్షన్ ని అందుకుంది. సో సినిమాపై ఇప్పుడు మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఫుల్ సినిమాకి బోయపాటి ఆ అంచనాలు రీచ్ అయ్యేలా తీసారో లేదో ఈ డిసెంబర్ 5కి తెలుస్తోంది.