మీసాల పిల్లా.. మెగా ఫ్యాన్స్ ఇంకాస్త ఆగాల్సిందే..!

Mana-Shankara-Vara-Prasad-G (1)

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌పై ఇప్పటికే మేకర్స్ ఓ బిగ్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

‘మీసాల పిల్లా’ అంటూ సాగే ఈ పాటను నేడు(అక్టోబర్ 13) రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, చివరి నిమిషంలో ఈ పాట రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనికి గల కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఫస్ట్ సింగిల్ సాంగ్‌తోనే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేయాలని మేకర్స్ భావించారు.

ఇక ఈ పాటను ఒకరోజు ఆలస్యంగా అక్టోబర్ 14న రిలీజ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. అయితే, ఈ పాటను ఏ సమయంలో రిలీజ్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సాహు గరపాటి మరియు సుష్మిత కొణిదెల నిర్మాతలుగా రూపొందించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. MSG సంక్రాంతి 2026 లో థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version