ఫోటో మూమెంట్ : హ్యాట్రిక్ హిట్ కోసం సన్నద్ధమవుతున్న వెంకీ-త్రివిక్రమ్

Venkatesh and Trivikram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో అదిరిపోయే క్రేజ్ ఉంది. వారి కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇక వీరిద్దరు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చేతులు కలుపుతున్నారు.

వెంకీ కెరీర్‌లో 77వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో త్రివిక్రమ్, వెంకీ చేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాదాపు 20 నెలల తర్వాత త్రివిక్రమ్ కెమెరా వెనకాల మెగాఫోన్ పట్టుకుని వెంకీతో హ్యాట్రిక్ హిట్ కోసం సన్నద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాను హరికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ(చిన్న బాబు) ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version