‘కాంతార చాప్టర్ 1’ కోసం రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Kantara-Chapter-1

కన్నడలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ పాన్ ఇండియా చిత్రం ‘కాంతార’కు సీక్వెల్‌గా రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘కాంతార: ఛాప్టర్ 1’ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ చిత్రం దసరా సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌ సినిమాపై సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో, హోంబలే ఫిలిమ్స్ ఈ ప్రాజెక్ట్‌ కోసం భారీగా పెట్టుబడి పెట్టింది.

అయితే, ఈ ప్రెస్టీజియస్ చిత్రం కోసం రిషబ్ శెట్టి భారీ పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. మొదటి భాగంతో పోలిస్తే ఈసారి బడ్జెట్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. తన పారితోషికం గురించి చర్చించకుండా, కొంత మొత్తాన్ని స్వయంగా నిర్మాణ ఖర్చులకే వినియోగించారు. విడుదలకు ముందే థియేట్రికల్‌, నాన్-థియేట్రికల్‌ హక్కులు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడవడం తో నిర్మాతలకు భారీ లాభాలు ఖాయం అయ్యాయి. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా 7000కి పైగా స్క్రీన్లలో విడుదల కానుంది.

Exit mobile version