దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటించిన రీసెంట్ యాక్షన్ డ్రామా ‘ఘాటి’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ దక్కింది. అయితే, అనుష్క పర్ఫార్మెన్స్కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
కాగా, ఘాటి చిత్రాన్ని ఓటీటీలో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఘాటి స్ట్రీమింగ్ హక్కులను కలిగిన ప్రైమ్ వీడియో ఈ చిత్రాన్ని రేపటి నుంచే (సెప్టెంబర్ 26) స్ట్రీమింగ్కి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
సాధారణంగా టాలీవుడ్లో అనుసరించే నాలుగు వారాల థియేట్రికల్ విండో బదులుగా, ఘాటి నిర్మాతలు మూడు వారాలకే డిజిటల్ విడుదలకు వెళ్ళారు. విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతిబాబు తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాను UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతాన్ని సమకూర్చారు.
The Queen's Reign is coming to your screens ????????#Ghaati streaming on @PrimeVideoIN from Tomorrow ❤????
⭐ing ‘The Queen’ @MsAnushkaShetty & @iamVikramPrabhu
???? Directed by the phenomenal @DirKrish
???? Proudly produced by @UV_Creations & @FirstFrame_Ent
???? Music by @NagavelliV… pic.twitter.com/B5aoGWLtWy— UV Creations (@UV_Creations) September 25, 2025