పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ఓజీ నేడు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్‌ను నిర్వహించారు చిత్ర యూనిట్.
ఈ సక్సెస్ మీట్‌లో దర్శకుడు సుజీత్ ఓజీ చిత్రంలో జానీ, తమ్ముడు చిత్ర సాంగ్స్ రీమిక్స్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఓజీ చిత్రంలో తొలుత జానీ సాంగ్‌ను రీమిక్స్ చేయాలని తాను భావించాడట. కానీ, థమన్ ఓ రోజు తనను పిలిచాడని.. అప్పటికే అక్కడ రమణ గోగుల కూడా ఉన్నాడని.. వారిద్దరు కలిసి జానీ చిత్రం సాంగ్ నుంచి తమ్ముడు సాంగ్ వరకు రెండు మిక్స్ చేసి రీమిక్స్ చేశారని ఆయన తెలిపాడు.
అలా ఓజీ చిత్రంలో పవన్ నటించిన చిత్రాలలోని సాంగ్స్‌ను తాజాగా రీమిక్స్ చేసి పెట్టడంతో ప్రేక్షకులు థ్రిల్ అవుతున్నారు. ఇక ఓజీ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటించాడు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేశారు.