యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ బాక్సాఫీస్ వద్ద తన దూకుడు కొనసాగిస్తోంది. ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఇక కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌లో మనోజ్ మంచు విలన్‌గా కనిపించారు.
ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మిరాయ్ ప్రస్తుతం నార్త్ అమెరికాలో $2.8 మిలియన్ల మార్క్‌ను క్రాస్ చేసింది. త్వరలో $3 మిలియన్ల క్లబ్‌లో చేరేందుకు ఈ సినిమా రెడీ అవుతుంది. ఈ మైలురాయిని చేరిన తెలుగు సినిమాలలో మిరాయ్ కూడా ఒకటిగా నిలవనుంది. హనుమాన్ తర్వాత తేజ సజ్జాకు ఇది రెండో రికార్డ్‌గా నిలువనుంది. అయితే, ఈ వారం ఓజీ రిలీజ్ అవుతుండటంతో మిరాయ్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రియా శరణ్, రితికా నాయక్, జగపతి బాబు, జయరాం ముఖ్య పాత్రలు పోషించారు. గౌర హరి ఈ చిత్రానికి సంగీతం అందించారు.