‘కాంతార 1’ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్!

Kantara-Chapter-1

ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రమే “కాంతార 1”. దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ భారీ డివోషనల్ చిత్రం రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో మరింత హైప్ అందుకుంది. ఇలా పాన్ ఇండియా భాషల్లో వచ్చిన ట్రైలర్ కి మొత్తం 24 గంటల్లో భారీ రెస్పాన్స్ వచ్చినట్టుగా మేకర్స్ చెబుతున్నారు.

తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్ ఏకంగా 107 మిలియన్ కి పైగా వ్యూస్ అలాగే 3.7 మిలియన్ లైక్స్ వచ్చినట్టుగా చెబుతున్నారు. దీనితో కాంతార 1 పట్ల ఆడియెన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారు అనేది మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అలాగే ఈ హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version