గుడ్ న్యూస్ షేర్ చేసిన ‘మల్లీశ్వరి’

వెంకీ మామ నటించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రాల్లో ‘మల్లీశ్వరి’ కూడా ఒకటి. మరి ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యిన బ్యూటీ కత్రినా కైఫ్ ఇపుడు బాలీవుడ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి కత్రినా కైఫ్ బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ లు గత కొన్నాళ్ల కితం పెళ్లి చేసుకున్నారు. అయితే ఫైనల్ గా తన నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది.

ఆమె, విక్కీ కౌశల్ లు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్టుగా ఆమె తాం బేబీ బంప్ తో హ్యాపీ మూమెంట్ ని తమ ముగ్గురి నడుమ షేర్ చేసుకుంది. దీనితో ఇది విన్న వారి ఫాలోవర్స్ అలాగే సినీ ప్రముఖులు ఆమె సహచర నటీనటులు ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీనితో ఇపుడు కత్రినా, విక్కీ కౌశల్ ల ఇంట ఆనందకర వాతావరణం నెలకొంది. ఈ ఏడాదిలోనే విక్కీ కౌశల్ ఛావా సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

Exit mobile version