యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రమే “మిరాయ్”. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలు అందుకొని అదరగొట్టింది. ఇలా తేజ సజ్జ కెరీర్ లో మరో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా రిలీజ్ రోజు ఆడియెన్స్ కొంచెం డిజప్పాయింట్ అయ్యారు.
ఎందుకంటే రిలీజ్ కి ముందు సూపర్ హిట్ అయ్యిన చార్ట్ బస్టర్ సాంగ్ వైబ్ ఉంది మొత్తం పాట సినిమాలో ఎక్కడా లేదు. దీనితో చాలా మంది ఈ సాంగ్ పరంగా నిరాశ చెందారు. కానీ ఫైనల్ గా డిమాండ్ మేరకి ఈ సాంగ్ నేటి నుంచి థియేటర్స్ లో కలిపి ప్రదర్శన కానుందట. సో మిరాయ్ లో ఈ సాంగ్ కోసం ఎదురు చూసినవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా మంచు మనోజ్ పవర్ఫుల్ రోల్ లో నటించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.