‘ఓజి’ టైటిల్ కార్డ్.. సుజీత్ వెర్షన్ కోసం అంతా వెయిటింగ్!

OG-Sujeeth

ఇపుడు మన హీరోల సినిమాలకి సినిమాలతో పాటుగా ఆ సినిమాల్లో ప్రతీ అంశం పట్ల అభిమానులు కొంచెం ఎక్కువే ఆశిస్తున్నారు. అలా మన హీరోల సినిమాల తాలూకా టైటిల్ కార్డ్స్ ఇంకా హీరో పేర్లని కూడా ఓ రేంజ్ అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఇలా రీసెంట్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన “హరిహర వీరమల్లు” కి ఆ సినిమా మేకర్స్ ఒక పవర్ఫుల్ టైటిల్ కార్డు ని డిజైన్ చేయడం మంచి ఎగ్జైటింగ్ గా మారింది.

ఆ సినిమా పక్కన పెడితే ఇపుడు అసలైన సినిమా రాబోతుంది. పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ బాయ్ తెరకెక్కించిన ఓజి సినిమాకి ఎలాంటి టైటిల్ కార్డుని ఈ యువ దర్శకుడు తన విజన్ తో డిజైన్ చేయించి ఉంటాడు అనేదే చర్చగా మారింది. సో ఈ అంశం పట్ల కూడా ఫ్యాన్స్ లో మంచి ఎగ్జైట్మెంట్ ఇపుడు నెలకొంది. మరి దీనిని ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా మేకర్స్ గ్రాండ్ రిలీజ్ కి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు.

Exit mobile version