డబ్బుని కాదు, దాన్నే దృష్టిలో పెట్టుకుంటా – తమన్నా

తమన్నా ఇటు వైవిధ్యమైన కథలలో నటిస్తూనే.. అటు ప్రత్యేక పాటలతోనూ ఆకట్టుకుంటుంది. కాగా ఇటీవలే ‘ఆజ్‌ కి రాత్‌..’ అంటూ ‘స్త్రీ 2’లో కూడా తమన్నా ఆడిపాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. ఈ పాట గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ, తమన్నా ఏం మాట్లాడింది అంటే.. ‘నేను ఒక ప్రాజెక్టుకు సంతకం చేసేటప్పుడు.. దాని ద్వారా నాకు వచ్చే డబ్బు గురించి ఆలోచించను. నేను చేస్తున్న పని ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుందా ? లేదా ? అనేదే దృష్టిలో పెట్టుకుంటా’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.

తమన్నా ఇంకా మాట్లాడుతూ.. ‘పాట, నటన, సినిమా.. ఇలా ఏదో ఒక విధంగా నేను చేస్తున్న పని ప్రేక్షకుల జీవితాల్ని తాకడం ముఖ్యం. ఇటీవల చాలా మంది తల్లులు నాకు ఫోన్‌ చేసి ‘ఆజ్‌ కి రాత్‌’ పాట పెడితేనే తమ పిల్లలు ఆహారం తింటున్నారని చెప్పారు. ఇందులో ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే పిల్లలకు సాహిత్యం అర్థం కాదు. కానీ వాళ్లు సంగీతం వింటూ ఎంజాయ్‌ చేస్తూ అన్నం తింటున్నారు’ అంటూ తమన్నా తెలిపింది. మొత్తానికి తమన్నా స్పెసల్ సాంగ్స్ ఇంకా చేసే ఆలోచనలో ఉందట.

Exit mobile version