నార్త్‌తో పాటు సౌత్‌లోనూ మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను 2023లో పెళ్లిచేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ జోడీ చాలా క్యూట్ కపుల్‌గా బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఇక కియారా గర్భంతో ఉన్న వార్తతో బాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు వారి డెలివరీ సమయం కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు.
అయితే, తాజాగా కియారా అద్వానీ ఓ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని.. తమ కుటుంబంలోకి ఓ అందాల రాజకుమారి రావడంతో తమ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉందని వారి సన్నిహితులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు తల్లిదండ్రులుగా మారడంతో వారి అభిమానులు వారిక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం వారికి విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.