‘వార్ 2’ ట్రైలర్.. వీటిపై స్పెషల్ కేర్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ కాంబినేషన్లో తెరకెక్కించిన భారీ చిత్రం “వార్ 2” కోసం అందరికీ తెలిసిందే. నార్త్ లో హృతిక్ చూసుకుంటే సౌత్ సహా యూఎస్ మార్కెట్ లో ఎన్టీఆర్ తన స్టామినా చూపిస్తున్నాడు. అయితే ట్రైలర్ తర్వాత ఇతర పాటలు, ట్రైలర్ లాంటివి ఇంకా రావాల్సి ఉంది.

మరి వీటిలో ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తుంది. దీనితో అయాన్ ముఖర్జీ స్పెషల్ కేర్ ని వి ఎఫ్ విషయంలో తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈసారి ఎన్టీఆర్ పై ఎలివేషన్స్ కూడా గట్టిగా ఉండేలా చూస్తున్నారట. అయితే టీజర్ కి విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో వచ్చిన కామెంట్స్ ఇపుడు రాకుండా మరింత నాచురల్ విజువల్ ఎఫెక్ట్స్ కనిపించే విధంగా డిజైన్ చేయిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version