‘టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు’ అంటూ ‘వర్జిన్ బాయ్స్’ ట్రైలర్ లాంచ్

రాజా దారపునేని నిర్మాతగా రాజ్ గురు బ్యానర్ పై దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నిఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్‌ను మీడియా సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. అలాగే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇస్తామని ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర బృందం తెలిపింది.

ఈ సందర్భంగా నటుడు రోనిత్ మాట్లాడుతూ.. “నేను దర్శకుడు దయ కాలేజ్ ఫ్రెండ్స్. అప్పటినుండే ఇద్దరం సినిమాలు చేయాలని అనుకునే వాళ్ళం. చూస్తే పది సంవత్సరాల తర్వాత ఒక సినిమా స్టేజిపై ఉన్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి నా ధన్యవాదాలు. అందరూ మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలకు ఊపిరి పోసే సినిమాగా వర్జిన్ బాయ్స్ నిలుస్తుందని అనుకుంటున్నాను. జూలై 11వ తేదీన అందరూ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అని అన్నారు.

నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ.. “నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకునికి ధన్యవాదాలు. నన్ను నమ్మి నాపై ఎంతో ఖర్చు పెట్టి నన్ను ఎంకరేజ్ చేసిన నిర్మాతకు నా ప్రత్యేక ధన్యవాదాలు. యువతను మెప్పించే చిత్రం వర్జిన్ బాయ్స్. అలాగే మత్తు పదార్థాలకు ఎవరు బానిసలు కాకండి. ఎవరైనా అటువంటి చర్యలు చేస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి సహకరించాలని, బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

నిర్మాత రాజా దారపునేని మాట్లాడుతూ.. “ఈ చిత్రానికి వర్జిన్ బాయ్స్ అనే టైటిల్ ఖచ్చితంగా సూట్ అయ్యే టైటిల్. ఇప్పటికే విడుదలైన టీజర్, ఒక పాట ఎంతో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో పెద్దవారు ఎవరూ లేరు. అయినా ఈ సినిమాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ థాంక్స్. ఎన్నో సర్ప్రైజ్ లతో ఈ సినిమాతో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము” అని అన్నారు.

దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ.. “మేము కాలేజీ రోజుల్లో ఉండగా చేసిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందరికీ కనెక్ట్ అవుతాయి. చిత్రానికి చాలా మంచి బృందం నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. స్మరణ్ సాయి సంగీతం ఈ చిత్రానికి బోనస్ గా నిలుస్తుంది. మా అన్నయ్య గీతానంద్ తో నాకు ఇది రెండవ చిత్రం. అలాగే గీతానంద్, మిత్ర శర్మ మధ్య సీన్లు అద్భుతంగా వచ్చింది. జూలై 11వ తేదీన ప్రేక్షకులంతా చూడవలసిన సినిమా వర్జిన్ బాయ్స్” అని అన్నారు.

నటి మిత్ర శర్మ మాట్లాడుతూ.. “ముందుగా ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొంచెం కొత్తగా అనిపించింది. అలాగే ఎంతో మందితో కలిసి నాకు నటించే అవకాశం ఈ సినిమాతో రావడం సంతోషంగా అనిపించింది. ముందుగా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దయానంద్ కు థాంక్స్. ఏదైనా సాధించాలి అనే సంకల్పంతో ముందుకు వచ్చాడు. తన కష్టం వల్లే మేము ఈరోజు ఈ స్టేజి మీద ఉన్నాము. రోనిత్ ఎంతో మంచి పర్ఫార్మెన్స్ చేశారు. శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ లేకపోతే సినిమాలో కిక్ ఉండదు. సినిమా చూసిన తర్వాత శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే గీతానంద్ తో కలిసి నటించడం బాగా ఎంజాయ్ చేశాను. చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి, బాగా సపోర్ట్ చేస్తారు. మా నిర్మాత రాజా గారు ఎంతో సహనం గలవారు. మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. మేము చేసిన కొన్ని మంచి పనులను చూసి ఆయన గొప్పగా చెప్పుకుని మురిసిపోతూ ఉంటారు. అలాగే ఈ చిత్రంలో నటించిన ఇతర నటీనటులకు, టెక్నీషియన్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు.” అని తెలిపారు.

Exit mobile version