రీరిలీజ్ లో ‘అందాల రాక్షసి’కి భారీ ఓపెనింగ్స్!

ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లో కొత్త సినిమాలు లేక పాత సినిమాలే మళ్ళీ థియేటర్స్ లో రాజ్యమేలుతున్నాయి. ఇలా థియేటర్స్ లో రీరిలీజ్ కి వచ్చిన మరో చిత్రమే “అందాల రాక్షసి”. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి అలాగే రాహుల్ రవీంద్రన్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ని అప్పుడు రిలీజ్ తర్వాత తెచ్చుకుంది.

ఇక ఫైనల్ గా రీరిలీజ్ కి వచ్చిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. ఈ మధ్య కాలంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి మాత్రమే 1 కోటికి పైగా గ్రాస్ వచ్చింది. మరి మళ్ళీ ఆ తర్వాత అందాల రాక్షసి మాత్రం ఈ ఫీట్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి మొదటి రోజు 1.12 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా మేకర్స్ చెబుతున్నారు. మొత్తానికి మాత్రం ఇప్పుడు అందాల రాక్షసి విషయంలో తెలుగు ఆడియెన్స్ ఫెయిల్ అవ్వలేదని చెప్పవచ్చు.

Exit mobile version