టీజర్ తో ‘అఖండ 2’ కొత్త రికార్డు.. బాలయ్య, ఎన్టీఆర్ లదే డామినేషన్!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రమే “అఖండ 2”. మొన్న బాలయ్య పుట్టినరోజు కానుకగా రిలీజ్ కి వచ్చిన టీజర్ తో ఒక్కసారిగా భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ టీజర్ యూట్యూబ్ లో అయితే టాప్ లో ట్రెండింగ్ అవుతూ కొనసాగుతుండగా ఈ ట్రెండింగ్ లో మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసినట్టు తెలుస్తుంది.

యూట్యూబ్ ట్రెండింగ్స్ లో అత్యధిక గంటల పాటుగా ట్రెండ్ అయ్యిన ఏకైక టీజర్ గా నిలిచి కొత్త రికార్డు అఖండ 2 టీజర్ సెట్ చేసిందట. ఇది వరకు పుష్ప 2 టీజర్ 138 గంటలకి పైగా టాప్ లో ట్రెండ్ అవుతూ కొనసాగగా దానిని 140 ప్లస్ గంటలతో క్రాస్ చేసి ఇప్పటికీ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

అయితే మన టాలీవుడ్ లో టాప్ ట్రెండింగ్ టీజర్ లలో బాలయ్య ఎన్టీఆర్ లదే డామినేషన్ కావడం విశేషం. మొత్తం టాప్ 5 లో 4 నందమూరి హీరోలవే ఉన్నాయి. టాప్ 1 లో అఖండ 2 ఉంటే టాప్ 3, 4 స్థానాల్లో ఎన్టీఆర్ జై లవకుశ అలాగే జనతా గ్యారేజ్ టీజర్ లు నిలవడం విశేషం. ఇలా మొత్తానికి బాబాయ్, అబ్బాయిల డామినేషన్ నే ఉందని చెప్పాలి.

Exit mobile version