ఇది కదా డార్లింగ్స్ కి కావాల్సింది.. సర్ప్రైజింగ్ గా ‘రాజాసాబ్’ కొత్త పోస్టర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే యంగ్ హీరోయిన్ రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ హా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన సాలిడ్ హారర్ ఎంటర్టైనర్ చిత్రమే “ది రాజా సాబ్” మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు వాటిని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది అని చెప్పాలి.

నిజానికి ప్రభాస్ ఫ్యాన్స్ కి ముందు నుంచీ ఈ సినిమా పట్ల లిమిటెడ్ గానే హోప్స్ ఉన్నప్పటికీ మేకర్స్ మాత్రం వాటిని ఎగ్జైటింగ్ అప్డేట్స్ తో మరింత పెంచుతున్నారని చెప్పాలి. అందుకు మరో ఉదాహరణే లేటెస్ట్ గా వచ్చిన క్రేజీ పోస్టర్ అని చెప్పొచ్చు. నిజానికి ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక ఊహించని సర్ప్రైజింగ్ ట్రీట్ అని చెప్పి తీరాల్సిందే.

ఈ రేంజ్ పోస్టర్ ని వారు చూసి దాదాపు ఏళ్ళు అయ్యిపోయి ఉంటుంది. వింటేజ్ డార్లింగ్ ని మిస్ అవుతున్న ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సిన ఎమోషన్ అనే రేంజ్ లో ఈ పోస్టర్ ఉంది. కార్ మీద కూర్చొని ప్రభాస్ స్వాగ్ తన యాటిట్యూడ్ గాని వేరే లెవెల్లో ఉన్నాయి. మొత్తానికి రేపు వచ్చే టీజర్ పై ఇప్పుడు మరిన్ని అంచనాలు పెరిగాయి.

Exit mobile version