వైజాగ్ లో గ్రీకువీరుడు ఆడియో లాంచ్?

Greekuveerudu
నాగార్జున, నయనతార జంటగా నటించిన ‘గ్రీకువీరుడు’ సినిమా ఏప్రిల్ 19న విడుదలకు సిద్దమవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో లాంచ్ మార్చ్ 23న భారి ఎత్తున వైజాగ్ లో నిర్వహిస్తారంట. ప్రస్తుతం ప్రతీ చిత్ర ఆడియో వేడుక హైదరాబాద్లోనే జరుగుతుంది. కానీ ఈ ఈవెంట్ కనుక విజయం సాదిస్తే ఒక పెద్ద హీరో సినిమా వేరే సిటీలో జరగడం రాబయే కాలపు ట్రెండ్ కావచ్చు.

కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దశరధ్ దర్శకత్వం వహించాడు. నాగార్జున ఈ సినిమాలో ఈవెంట్ మేనేజర్ పాత్ర పోషించాడు. మీరా చోప్రా, బ్రహ్మానందం మరియు ఎం. ఎస్ నారాయణ ముఖ్య పత్రాలు పోషించారు. థమన్ సంగీతం అందించాడు.

Exit mobile version