తుది మెరుగులు దిద్దుకుంటున్న కళ్యాణ్ రామ్ ‘ఓం’

Kalyan_Ram_upcoming_3D
‘కత్తి’ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ‘ఓం’ అనే 3డి సినిమాతో త్వరలో మనముందుకు రానున్నాడు. కృతి కర్భంద, నిఖీషా పటేల్ హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాకి సునీల్ రెడ్డి డైరెక్టర్. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా 150 రోజులు షూటింగ్ జరుపుకుంది. హాలీవుడ్ సినిమాలైన ‘స్టెప్ అప్ 3’, ‘ఫైనల్ డెస్టినేషన్’, ‘అవతార్’, స్పైడర్ మాన్ 4′ సినిమాలకు పనిచేసిన 3డి టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ సినిమాకి అచ్చు – సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Exit mobile version