మరోసారి ఇంటిని తాకట్టు పెట్టిన కమలహసన్

Kamal-Haasan
విలక్షణ నటుడు కమలహసన్ ‘విశ్వరూపం’ సినిమా విడుదలతో తన కష్టాలన్నీ తొలిగిపోయాయి అని మనకు తెలుసు. కొన్ని రోజులకు ముందు విడుదలైన ఈ సినిమా నిర్మించడానికి 90కోట్ల రూపాయలు ఖర్చయింది. ఈ డబ్బుని కమలహాసన్ తన ఇంటిని ఒక వడ్డీ వ్యాపారి వద్ద తాకట్టు పెట్టి తెచ్చారు. ఈ సినిమా ప్రకటించిన తేది కంటే 10 రోజుల తరువాత విడుదలైంది. జనవరిలో విడుదలైన ఈ సినిమా తమిళనాడులో మంచి పేరును సంపాదించింది. కాని కమలహాసన్ కు మాత్రం ఆశించినంత లాభం రాలేదు. తను ఈ సినిమా కోసం తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిచడానికి బ్యాంకులో ఋణం తీసుకోని చెల్లించాడు. ‘నేను అప్పుగా తీసుకున్న డబ్బును చెల్లిచడానికి ఒక జాతీయ బ్యాంక్ లో ఋణం తీసుకుని వారికీ చెల్లిచాను. దీనిని తొందరలోనే బ్యాంకుకు చెల్లించి నా ఇంటిని తాకట్టు నుండి విడిపించుకుంటాను’ అని ఒక ఇంటర్వ్యూ లో అన్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం మరోభాగాన్ని తీసే పనివున్నారు. అలాగే ‘మో’ అనే ఇంకోక సినిమాలో కూడా నటిస్తున్నారు.

Exit mobile version