సౌత్ సినిమాలపై మళ్లీ కన్నేసిన అసిన్

Asin

టాలెంట్ కలిగిన సుందరి ఆసిన్ నటించిన హిందీ ‘గజినీ’ విజయం తరువాత బాలీవుడ్లో పాగా వేసింది. ‘అన్నవరం’ చిత్రం తరువాత ఆమె మరో తెలుగు చిత్రంలో నటించలేదు. కానీ ఇప్పుడు అసిన్ సౌత్ ఫిల్మ్స్ చేసే ఆలోచనలోపడింది. ప్రస్తుతం ఆసిన్ కొన్ని స్క్రిప్ట్ లు చదువుతూ బిజీగా ఉంది. త్వరలోనే కొన్ని సినిమాలకు సంతకాలు చేసే ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమెకు హిందీలో ఎక్కువ అవకాశాలు లేకపోవడం వల్ల దక్షిణాది చిత్రాలపై దృష్తిసారిస్తుంది.

ముంబాయిలో ప్రెస్ తో మాట్లాడుతూ “నేను కొన్ని ఆసక్తికరమైన తెలుగు మరియు తమిళ్ స్క్రిప్ట్స్ చదివాను, అవి చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నానని” అసిన్ వెల్లడించింది.

Exit mobile version