ప్రముఖ టీవీ యాంకర్ ఝాన్సీ తన కెరీర్ లో కొత్త పాత్ర పోషించనున్నారు. మహిళ చుట్టూ తిరిగే కధాంశంతో తీసిన ఇంగ్లీష్ చిత్రం ‘ఆల్ ఐ వాంట్ ఇజ్ ఎవ్రీథింగ్ ‘కి ఝాన్సీ సహనిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి టీవీ9లో కార్యనిర్వాహక నిర్మాతగా వ్యవహరిస్తున్న శీతల్ మొర్జరియా దర్శకత్వం అందించారు. విరిరువురూ ప్రముఖ టీవీ9 ప్రోగ్రాం ‘నవీన’లో కలిసి పనిచేసారు. ‘ఆల్ ఐ వాంట్ ఇజ్ ఎవ్రీథింగ్ ‘ ముగ్గురు ఆడవాళ్ళ స్నేహం చుట్టు తిరిగే కథ. సంపద హర్కార, సాగరి వెంకట మరియు లంతా మిచ్చెల్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్యాం ప్రసాద్ వసిలి సినిమాటోగ్రఫీ అందిచగా పర్సా పహ్లెవన్ జాడే సంగీతం అందించారు. ఈ చిత్ర నిడివి కేవలం 62నిమిషాలు మాత్రమేనట. మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చెయ్యనున్నారు. ఝాన్సీ మరియు రేఖ పప్పు ఈ చిత్రాన్ని నిర్మించారు.