కోనా వెంకట్ తో కలిసి ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘దేనికైనా రెడీ’ వంటి చిత్రాలకు స్క్రిప్ట్ అందించిన ప్రముఖ రచయిత గోపీ మోహన్ ఈ ఏడాదిలో మెగా ఫోన్ పట్టచ్చు. తాజా సమాచారం ప్రకారం కొంతకాలంగా ఈయనకి చిత్రానికి దర్శకత్వం వహించాలని ఉన్నా, వివిధ హీరోలకు సరిపడే వైవిధ్యమైన స్క్రిప్ట్స్ అందించాలని ఆచి తూచి వ్యవహరిస్తున్నాడట. ప్రస్తుతం వినిపిస్తున్న వార్త ఏంటంటే తన తోలి చిత్రంకోసం గోపి మోహన్ సునీల్ తో చర్చలు జరిపాడట. అయితే ఈ చర్చలు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయంట. ప్రస్తుతం వీరిద్దరు వారి వారి ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు కనుక ఈ చిత్రం ఈ ఏడాది చివరలో మొదలు కావచ్చు.
ఈ వేసవిలో రాబోయే ‘బాద్ షా’, ‘షాడో’ వంటి రెండు పెద్ద సినిమాలకూ గోపీ మోహన్ మరియు కోన వెంకట్ కథా రచయితలు. ఈ సినిమాలు ఏప్రిల్ లో కావడానికి సిద్దంగా ఉన్నాయి.