మణిరత్నం స్వీయ దర్శకత్వంలో తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కిన కడల్ వల్ల నష్టపోయమంటూ తమిళ్ డిస్ట్రిబ్యూటర్లు మణిరత్నం పై కేసు పెట్టారు. కడల్ సినిమా వల్ల తమకు 16 కోట్లు నష్టం వచ్చిందంటూ మన్నన్ డిస్ట్రిబ్యూటర్స్ వారు చెన్నై లోని అభిరామపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు. మణిరత్నం ప్రస్తుతం కోడైకెనాల్ లో ఉన్నారు. అయితే వీరితో నాకు సంబంధం లేదంటూ మణిరత్నం ఇటీవలే ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. తన సినిమా పంపిణీ హక్కులు జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థకి అమ్మినట్లు డిస్ట్రి బ్యూటర్లతో తనకు సంబందం లేదని ఆయన ప్రెస్ నోట్ విడుదల చేసారు.