ఒంగోలు గిత్త చిత్రీకరణ సమయంలో రామ్ గాయపడ్డారు. మరీ పెద్ద గాయం కాకపోయినా చిన్నపాటి ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తుంది. వైద్యులు మరి కొద్ది వారల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. దీని కారణంగా మరో నలుగు వారాల పాటు రామ్ యాక్షన్ కి దూరంగా ఉండబోతున్నారు. “మరి కొద్ది వారాల పాటు ఫైట్ లు లేవు. నా కాలి మడమ గాయపడింది వైద్యులు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు” అని రామ్ ట్వీట్ చేశారు. ఈ చిత్ర చిత్రీకరణ పూర్తయ్యింది ఫిబ్రవరి 1న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. రామ్ ఈ చిత్ర ప్యాచ్ వర్క్ లో పాల్గొంటున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.రామ్ సరసన కృతి కర్భంద నటిస్తున్న ఈ చిత్రానికి భాస్కర్ దర్శకత్వం వహించగా బివి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు. జి వి ప్రకాష్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఒక పాటను మణిశర్మ అందించడమే కాకుండా నేపధ్య సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తున్నారు.