వి3 ఫిలిమ్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్.2 ప్రారంభం!

వి3 ఫిలిమ్స్ బ్యానర్ సుబ్రమణ్యం మలసాని నిర్మాతగా కేశవ్ దేపూర్ దర్శకత్వంలో నూతన సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో ప్రముఖ హీరో, హీరోయిన్ నటించబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత సుబ్రమణ్యం మలసాని మాట్లాడుతూ… మా వి3 ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన మొదటి సినిమా డబ్ శ్మాష్ కు దర్శకత్వం వహించిన కేశవ్ దేపూర్ గారితో మేము ఇంకో సినిమా ప్రొడక్షన్ నెంబర్.2 చేయబోతున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాలో ప్రముఖ హీరో హీరోయిన్ నటించబోతున్నారు, వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాము. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మా సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. మా మొదటి సినిమాకి ఇచ్చిన సపోర్ట్ మళ్లీ ఈ సినిమాకి కూడా అందించాలని కోరుకుంటున్నాము అన్నారు.

Exit mobile version